Share News

Monsoon Impact: పెరిగిన భూగర్భ జలాలు

ABN , Publish Date - Sep 12 , 2025 | 05:08 AM

రాష్ట్రంలో గతేడాది కన్నా ఈ ఏడాది భూగర్భ జలాలు మెరుగ్గా ఉన్నాయి. నీటి లభ్యత పెరిగింది. ప్రజలు వినియోగించదగిన భూగర్భ జలాలు 697.52 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. ఈ మొత్తం రాష్ట్రంలోని...

Monsoon Impact: పెరిగిన భూగర్భ జలాలు

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో గతేడాది కన్నా ఈ ఏడాది భూగర్భ జలాలు మెరుగ్గా ఉన్నాయి. నీటి లభ్యత పెరిగింది. ప్రజలు వినియోగించదగిన భూగర్భ జలాలు 697.52 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. ఈ మొత్తం రాష్ట్రంలోని కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల్లో ప్రస్తుతమున్న నీటి నిల్వ (654.25 టీంఎంసీల) కన్నా అధికం. ఈ ఏడాది ఆలస్యంగానైనా వర్షాలు విస్తారంగా కురవడం, కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదులకు వరదలు రావడం తదితర కారణాలు భూగర్భ జలాలపై ప్రభావం చూపాయని నిపుణులు చెప్తున్నారు. సెప్టెంబరు 1 నాటికి కోస్తాంధ్ర ప్రాంతంలో 468.44 టీఎంసీలు, రాయలసీమ ప్రాంతంలో 229.10 టీఎంసీల నీరు ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సగటున 3 మీటర్ల లోతులో 30.22శాతం, 3-8 మీటర్ల లోతులో 34.71శాతం, 8-20 మీటర్ల లోతులో 25.73శాతం, 20 మీటర్ల కన్నా ఎక్కువ లోతులో 9.33శాతం భూగర్భ జలాలు ఉన్నట్లు ఏపీ వాటర్‌ రిసోర్సెస్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(ఏపీవ్రిమ్స్‌) అంచనా వేసింది. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 50.94 టీఎంసీలు, అతి తక్కువగా విశాఖపట్నం జిల్లాలో 2.87 టీఎంసీల నీరుఉన్నట్లు ఏపీ వ్రిమ్స్‌ పోర్టల్‌లో నమోదు చేసింది.

Updated Date - Sep 12 , 2025 | 05:09 AM