Labour Welfare Board: కార్మికుల అడ్డాల వద్ద ఇమ్యూనిటీ కాంప్లెక్స్‌లు
ABN , Publish Date - Aug 06 , 2025 | 05:31 AM
రాష్ట్రంలోని కార్మికుల సౌకర్యార్థం జిల్లాల్లో ‘ఇంటిగ్రేటెడ్ లేబర్ ఇమ్యూనిటీ కాంప్లెక్స్’లు నిర్మించాలని కార్మిక సంక్షేమ బోర్డు నిర్ణయం తీసుకుంది.
అమరావతి, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కార్మికుల సౌకర్యార్థం జిల్లాల్లో ‘ఇంటిగ్రేటెడ్ లేబర్ ఇమ్యూనిటీ కాంప్లెక్స్’లు నిర్మించాలని కార్మిక సంక్షేమ బోర్డు నిర్ణయం తీసుకుంది. మంగళవారం విజయవాడలోని కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, చైర్మన్ వి.బాబ్జీ నేతృత్వంలో బోర్డు తొలి సమావేశం నిర్వహించారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిల్లో ఇంటిగ్రేటెడ్ లేబర్ ఇమ్యూనిటీ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు నైపుణ్యం పెంపొందించే కార్యక్రమాలు నిర్వహిస్తారు. అసిస్టెంట్ లేబర్ కమిషనర్ల విధుల్లోని కొన్నింటిని సామాజిక భద్రత రక్షణ అధికారులకు బదలాయించాలని, భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు ఐటీ నైపుణ్యాలు పెంచేందుకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.