Minister Atchannaidu: యూరియా సమస్యలకు తక్షణ పరిష్కారం
ABN , Publish Date - Sep 05 , 2025 | 06:08 AM
రైతులకు నేరుగా యూరియా చేరేలా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.
గతం కంటే అదనంగా 48,478 టన్నుల సరఫరా: అచ్చెన్న
అమరావతి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): రైతులకు నేరుగా యూరియా చేరేలా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. అక్రమాలకు తావు లేకుండా, ఎక్కడ సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించే వ్యవస్థను ఏర్పాటు చేశామని గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి జిల్లాలో యూరియా సరఫరా, పంపిణీని పర్యవేక్షిస్తూ, తగిన నిల్వలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో కన్నా 31ు అధికంగా 48,478 టన్నుల యూరియాను మార్క్‌ఫెడ్ ద్వారా అదనంగా సరఫరా చేసినట్లు తెలిపారు.