ఇమామ్‌లకు గౌరవ వేతనమివ్వాలి
ABN , Publish Date - Sep 30 , 2025 | 12:11 AM
ఇమామ్‌లకు, మౌజనలకు గౌరవ వేతనమివ్వాలని కోడుమూరు ముస్లిం మైనారిటీ నాయకులు కోరారు.
నంద్యాల రూరల్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : ఇమామ్‌లకు, మౌజనలకు గౌరవ వేతనమివ్వాలని కోడుమూరు ముస్లిం మైనారిటీ నాయకులు కోరారు. సోమవారం కేడీసీసీ చైర్మన విష్ణువర్ధన రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి ఎనఎండీ ఫరూక్‌ను మర్యాదపూర్వకంగా కలి సి పలు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. కోడు మూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన ఎల్లప్ప నాయుడు, నాయకులు గంగాధర్ నాయుడు, రాజు, దావుద్ బాషా పాల్గొన్నారు.
ప్రతి సమస్యను పరిష్కరిస్తాం
నంద్యాల రూరల్ : పెన్షనర్స్ అసోసియేషన సభ్యుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి ఎనఎండీ ఫరూక్ హామీ ఇచ్చారు. నంద్యాల పెన్షనర్స్ అసోసియేషన ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులు సోమవారం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్నికైన కార్యవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన అధ్యక్షుడు రామసుబ్బయ్య, సహాధ్యక్షుడు గఫార్, కోశాధికారి ఖాసీంవలి, ఉపాధ్యక్షులు డేవిడ్, పద్మనాభం పాల్గొన్నారు.