Share News

Wildlife Smuggling: విదేశీ పక్షుల అక్రమ రవాణా గుట్టురట్టు

ABN , Publish Date - Aug 20 , 2025 | 05:13 AM

ఆస్ట్రేలియన్‌ ఫించెస్‌, కోన్సూర్‌ జాతికి చెందిన విదేశీ రామచిలకలను అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరిని శ్రీకాకుళం కాశీబుగ్గ అటవీశాఖ అధికారులు..

Wildlife Smuggling: విదేశీ పక్షుల అక్రమ రవాణా గుట్టురట్టు

పలాస, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ఆస్ట్రేలియన్‌ ఫించెస్‌, కోన్సూర్‌ జాతికి చెందిన విదేశీ రామచిలకలను అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరిని శ్రీకాకుళం కాశీబుగ్గ అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కోల్‌కతాకు చెందిన రోంటిదాస్‌, అమృత్‌గ్యాన్‌ అనే వ్యక్తులు కారులో విదేశీ పక్షులను చెన్నైకు తరలిస్తూ మార్గమధ్యంలో పలాస జాతీయ ర హదారి నీలావతి రైల్వేగేటు వద్ద ఉన్న ఓ లాడ్జిలో సోమవారం రాత్రి బస చేశారు. కారులోని పక్షుల అరుపులు విన్న లాడ్జి సిబ్బంది పరిశీలించి, కాశీబుగ్గ అటవీ అధికారి మురళీకృష్ణనాయుడుకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆయన రోంటిదాస్‌, అమృత్‌గ్యాన్‌ను, కారును అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 236 పక్షులు అందులో కిక్కిరిసి ఉన్నట్టు గుర్తించారు. వణ్యప్రాణుల రక్షణ చట్టం ప్రకారం నిందితులపై కేసు నమోదు చేశామని, పక్షులను విశాఖపట్నం జంతు ప్రదర్శనశాలకు తరలిస్తున్నామని అధికారులు తెలిపారు.

Updated Date - Aug 20 , 2025 | 05:13 AM