Illegal Transport: ట్రావెల్స్ బస్సులో 500 కిలోల గోమాంసం
ABN , Publish Date - Nov 22 , 2025 | 05:02 AM
శాఖపట్నం నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న గోమాంసాన్ని ప్రకాశం జిల్లా...
సింగరాయకొండ, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న గోమాంసాన్ని ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. 11 బాక్సుల్లో ఉన్న సుమారు 500 కేజీల మాంసాన్ని సీజ్ చేసి, బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పశువైద్యుడు హజరత్ పరిశీలించి ప్రాథమికంగా అది గోమాంసం అని నిర్ధారించారు. పూర్తిస్థాయి నిర్ధారణ కోసం శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపించినట్లు సింగరాయకొండ ఎస్‌ఐ మహేంద్ర తెలిపారు.