Share News

కష్టపడితే ఉన్నత శిఖరాలను అధిరోహించొచ్చు

ABN , Publish Date - Sep 23 , 2025 | 11:21 PM

పుట్టుకతో ఎవరు గొప్పవారు కాలేరని, కష్టపడితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు అన్నారు.

కష్టపడితే ఉన్నత శిఖరాలను అధిరోహించొచ్చు
ర్యాలీలో పాల్గొన్న అభిరుచి మధు

బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు

నంద్యాల నూనెపల్లి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : పుట్టుకతో ఎవరు గొప్పవారు కాలేరని, కష్టపడితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు అన్నారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా పక్షోత్సవాలలో భాగంగా మంగళవారం బొమ్మలసత్రంలోని ఎస్పీవైరెడ్డి మహిళా డిగ్రీ కళాశాలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ ఒక సాధారణ కుటుంబంలో పుట్టి చిన్నతనంలో టీ అమ్ముతూ జీవన పోరాటం ప్రారంభించి నేడు ప్రధాని స్థాయికి ఎదగడం ప్రతి విద్యార్థికి ప్రేరణ కావాలన్నారు. ప్రతి విద్యార్థి ప్రధానిని ఆదర్శంగా తీసుకొని జీవితంలోని ప్రతి రంగంలో కష్ట పడుతూ ముందుకు సాగితే గొప్ప స్థానాలు దక్కించుకోవచ్చునన్నారు. ఇందులో భాగంగా మోదీ బాల్యం, కష్టాలు, సాధించిన విజయాలు అనే డాక్యుమెంటరీ ప్రదర్శించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నిమ్మకాయల సుధాకర్‌, ఉపేంద్రనాధరెడ్డి, లక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 23 , 2025 | 11:21 PM