ఎమ్మెల్యే కనబడితే సమాచారమివ్వండి
ABN , Publish Date - Sep 24 , 2025 | 11:22 PM
ఆదోని ఎమ్మెల్యే కనబడితే తమకు సమాచారమివ్వాలని, ఎన్నికల ముందు వచ్చి హామీలిచ్చి కనిపించకుండా పోయారంటూ నాగనాథనహళ్లి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
నాగనాథన గ్రామస్థులు
రోడ్డుపై మొక్కలు నాటి నిరసన
సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత
ఆదోని రూరల్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : ఆదోని ఎమ్మెల్యే కనబడితే తమకు సమాచారమివ్వాలని, ఎన్నికల ముందు వచ్చి హామీలిచ్చి కనిపించకుండా పోయారంటూ నాగనాథనహళ్లి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు తనను గెలిపిస్తే రెండు నెలల్లో రోడ్లు వేయిస్తానని చెప్పి 20నెలలైనా పట్టించుకోకపోవడంతో బుధవారం వారు ఆందోళన బాట పట్డారు. గ్రామ ప్రధాన రహదారి గుంతలమయమై వర్షపునీటితో నిండి పో యిందని, తాము ఈ రహదారిపై ఎలా తిరిగేదంటూ ప్రశ్నించారు. రోడ్డుపై ఆగిన నీటిలో పలురకాల మొక్కలు నాటి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే డౌన డౌన అంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీలో రోడ్లపై మాట్లాడకుండా ఆదోనిని జిల్లా చేయాలని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సబ్‌కలెక్టర్ మౌర్య భరద్వాజ్‌కు వారు వినతిపత్రం అందజేశారు.