Share News

జగన్‌.. ధైర్యముంటే రాజధానికి రా: దేవినేని ఉమ

ABN , Publish Date - Aug 19 , 2025 | 06:03 AM

జగన్‌కు ధైర్యం ఉంటే రాజధాని అమరావతిలో పర్యటించాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సవాల్‌ చేశారు.

జగన్‌.. ధైర్యముంటే రాజధానికి రా: దేవినేని ఉమ

అమరావతి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): జగన్‌కు ధైర్యం ఉంటే రాజధాని అమరావతిలో పర్యటించాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సవాల్‌ చేశారు. ‘కుంభకోణాలకు, అక్రమాలకు పాల్పడిన వారిని పరామర్శించడానికి జైలు యాత్రలు మానేసి, రాజధానికి రావాలి. అక్కడ జరుగుతున్న అభివృద్ధిని స్వయంగా చూడాలి. సీడ్‌ యాక్సెస్‌ రహదారి, సచివాలయం, విట్‌, ఎస్‌ఆర్‌ఎం... జగన్‌ ఎక్కడికి వచ్చినా సరే అమరావతి ఎక్కడా మునగలేదని నిరూపించేందుకు సిద్ధం’ అని దేవినేని అన్నారు.

Updated Date - Aug 19 , 2025 | 06:03 AM