ఎల్‌ఆర్‌ఎస్ చేసుకోకుంటే ఇబ్బందులు తప్పవు
ABN , Publish Date - Aug 30 , 2025 | 12:09 AM
ప్రభుత్వం అవకాశం కల్పించిన లేఅవుట్ రెగ్యులైజేషన స్కీంను ప్లాట్ల యజమా నులు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ శేషఫణి, టీపీవో వెంకటరమణారెడ్డి కోరారు.
ఎర్రగుంట్ల, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అవకాశం కల్పించిన లేఅవుట్ రెగ్యులైజేషన స్కీంను ప్లాట్ల యజమా నులు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ శేషఫణి, టీపీవో వెంకటరమణారెడ్డి కోరారు. ఈ స్కీంపై అవేట్స్ వేసిన వారితో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఎర్రగుంట్లలో ఇప్పటి వరకు ఒక్కలే అవుట్‌కు కూడా అనుమతి లేదన్నారు. సుమారు 31 లేఅవుట్లు ఉన్నా యని 2019 తరువాత వేసిన అనధికార అవేట్స్‌ను రెగ్యులర్ చేసుకునేందుకు ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ 2020 జీవో విడుదల చేసినందన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ కింద ప్లాట్ల యజ మానులు 45రోజుల్లోపు ముందుగా రూ.10వేలను చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. తరువాత ప్రభుత్వ నిబందనల ప్రకారం వారు ఎంత చెల్లించాల్సింది తెలియజేస్తామన్నారు.