ఆపరేషన కోసమని వస్తే..
ABN , Publish Date - Oct 12 , 2025 | 12:07 AM
హార్ట్ ఆపరేషన కోసమని వచ్చిన ఓ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి విషమించి మృతిచెందాడు.
వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న బంధువులు
శవంతో హాస్పిటల్ ఎదుట ఆందోళన
కార్డియాక్ అరెస్టు అంటున్న వైద్యులు
కర్నూలు హాస్పిటల్, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): హార్ట్ ఆపరేషన కోసమని వచ్చిన ఓ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి విషమించి మృతిచెందాడు. ఈ ఘటన నగరంలోని కొత్తబస్టాండు సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహించిన బంధువులు శవంతో హాస్పిటల్ ఎదుట ఆందోళన చేశారు. మునగాలపాడుకు చెందిన పెద్ద మాదన్న(56) గుండె సంబంధిత సమస్యతో కల్లూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి ఈ నెల 5వ తేదీన కొత్తబస్టాండు సమీపంలోని హాస్పిటల్‌కు వెళ్లారు. అక్కడ మోషన దగ్గర రక్తస్రావం ఉండటంతో మూడు రోజుల ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. హార్ట్ ఆపరేషనకు ఏర్పాటుచేశారు. శనివారం అంతా సిద్ధంచేసి ఆపరేషన వాయిదా వేస్తున్నట్లు ఉద యం 10 గంటలకు వైద్యులు ప్రకటించారు. మధ్యాహ్నం 12 గంటలకు రోగి చనిపోయాడని వైద్యులు తెలిపారు. దీంతో బంధువులు ఆగ్రహానికి గురై శవంతో హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. న్యాయం జరిగేంత వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి బాధితులతో మాట్లాడి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై హాస్పిటల్ యాజమాన్యం వివరణ ఇస్తూ రోగికి మోషన బ్లీడింగ్ అవుతుంటే మూడు రోజులు ఐసీయూలో ఉంచి ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేశామన్నారు. తర్వాత కార్డియాక్ట్ అరెస్టుతో చనిపోయాడని, వైద్యుల నిర్లక్ష్యం లేదంటూ వివరరించారు.