Share News

వక్ఫ్‌ చట్టాన్ని పరిరక్షించుకోకపోతే మైనార్టీల మనుగడే కష్టం

ABN , Publish Date - Jun 14 , 2025 | 11:39 PM

వక్ఫ్‌ చట్టాన్ని పరిరక్షించుకోకపోతే మైనార్టీల మనుగడకే కష్టమని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు.

వక్ఫ్‌ చట్టాన్ని పరిరక్షించుకోకపోతే  మైనార్టీల మనుగడే కష్టం
మాట్లాడుతున్న ఎంఐఎం అధినేత అసాదుద్దీన్‌ ఓవైసీ

ఫ ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ

ఆదోని అగ్రికల్చర్‌, జూన్‌14(ఆంధ్రజ్యోతి): వక్ఫ్‌ చట్టాన్ని పరిరక్షించుకోకపోతే మైనార్టీల మనుగడకే కష్టమని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. శనివారం రాత్రి జామియా మసీదు వెనక భాగంలోని మసూదియా పాఠశాల ఆవరణలో ఆలిండియా ముస్లీం లా బోర్డు ఆధ్వర్యంలో వక్ఫ్‌ చట్టంపై బహిరంగ సభ నిర్వహిం చారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కేవలం ముస్లింలపై ఉన్న శ్రద్ధ దేశ రక్షణపై లేదని ఆరోపించారు. వక్ఫ్‌ చట్ట సవరణకు మద్దతు తెలిపిన సీఎం చంద్రబాబు, నితీ్‌షకుమార్‌, కుమారస్వామి ఎందుకు మద్దతు తెలిపారో ప్రజలకు చెప్పాలన్నారు. బ్రిటీష్‌ కాలంనాటి వక్ఫ్‌ ఆస్తులు మాత్రమే ఉన్నాయని, అలాంటి చట్టాన్ని మార్చడం దుర్మార్గమన్నారు. సమావేశంలో ముస్లీం మైనార్టీ నాయకులు హజ్రత్‌మౌలానా, జాకీర్‌సాబ్‌, ఖలీజ్‌సైఫుల్లా రహమాన్‌, నిజామీజల్సాసయ్యద్‌, జుబేర్‌సాహెబ్‌, మౌలానా సయ్యద్‌హుసేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 11:39 PM