I-Bomma Ravi Father: నిర్మాత కల్యాణ్‌నే ఎన్‌కౌంటర్ చేయాలి
ABN , Publish Date - Nov 24 , 2025 | 06:07 AM
సినీ నిర్మాణ సి.కల్యాణ్‌నే పోలీసులు ఎన్‌కౌంటర్ చేయాలని ఐ బొమ్మ రవి తండ్రి చినఅప్పారావు డిమాండ్ చేశారు.
ఐబొమ్మ రవి తండ్రి చిన అప్పారావు వ్యాఖ్యలు
విశాఖపట్నం, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): సినీ నిర్మాణ సి.కల్యాణ్‌నే పోలీసులు ఎన్‌కౌంటర్ చేయాలని ఐ బొమ్మ రవి తండ్రి చినఅప్పారావు డిమాండ్ చేశారు. ఆదివారం విశాఖలోని ఆయన నివాసానికి వచ్చిన మీడియా ప్రతినిధులు... ఐబొమ్మ రవిని ఎన్‌కౌంటర్ చేయాలని నిర్మాత కల్యాణ్ చేసిన డిమాండ్‌ను ప్రస్తావించగా.. ఆయన పైవిధంగా ప్రతిస్పందించారు. ‘కల్యాణ్ చెప్పినట్టే పోలీసులు రవిని ఎన్‌కౌంటర్ చేసేస్తే ఇక చట్టాలు ఎందుకు?’ అని ప్రశ్నించారు. అసలు సినిమా పైరసీ ఎందుకు వచ్చిందనే దానితో పాటు దానిని ప్రజలు ఎందుకు ఆదరిస్తున్నారో కల్యాణ్ ఒకసారి ఆలోచించుకోవాలన్నారు.