సమస్యలన్నీ పరిష్కరిస్తా
ABN , Publish Date - Jul 03 , 2025 | 12:56 AM
‘నా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ పరిష్కరిస్తా.. నా సొంత నియోజకవర్గంలో ఏబీఎన-ఆంధ్రజ్యోతి చక్కని వేదికను ఏర్పాటు చేసి ప్రజల పక్షాన నిలవడం ఆనందంగా ఉంది.
ఏబీఎన- ఆంధ్రజ్యోతి ఎప్పటికీ ప్రజాపక్షమే
ప్రజా సమస్యలను గుర్తించి నా దృష్టికి తెచ్చారు
రూ.కోట్లతో ఆ సమస్యల పరిష్కారం
రాష్ట్ర మైనార్టీ, న్యాయ శాఖ మంత్రి ఎనఎండీ ఫరూక్
నంద్యాలలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా..’ సక్సెస్ మీట్
భారీగా తరలివచ్చిన నందమూరినగర్ వాసులు
ఆంధ్రజ్యోతికి కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు
నంద్యాల, జూలై 2(ఆంధ్రజ్యోతి): ‘నా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ పరిష్కరిస్తా.. నా సొంత నియోజకవర్గంలో ఏబీఎన-ఆంధ్రజ్యోతి చక్కని వేదికను ఏర్పాటు చేసి ప్రజల పక్షాన నిలవడం ఆనందంగా ఉంది. ప్రజల కోసం ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి నంద్యాలను ప్రగతిపథంలో నిలుపుతా..’ అని రాష్ట్ర మైనార్టీ, న్యాయ శాఖ మంత్రి ఎనఎండీ ఫరూక్ వెల్లడించారు. ప్రజల పక్షాన నిలుస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఓ బృహత్తర కార్యక్రమానికి ఇటీవల శ్రీకారం చుట్టింది. ‘అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా..’ పేరుతో ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చి పరిష్కరించే కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా జనవరి నెలలో ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో నంద్యాలలోని 37,38 వార్డుల పరిధి నందమూరినగర్, వైఎస్సార్ నగర్‌లలో సమస్యలను గుర్తించి అక్కడ ప్రజలతో ప్రజావేదికను నిర్వహించింది. ఈ సందర్భంగా అప్పట్లో ప్రజాప్రతినిధులు, అధికారులను రప్పించి ప్రజల ఎదుటే సమస్యలను పరిష్కారం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. 38వ వార్డు పరిధి నందమూరి నగర్, వైఎస్సార్ నగర్‌లలో రూ.3కోట్ల వ్యయంతో సమస్యలు పరిష్కారమయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో విజయోత్సవ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మైనార్టీ, న్యాయ శాఖ మంత్రి ఎనఎండీ ఫరూక్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రితో పాటు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనఎండీ ఫీరోజ్, నగర కమిషనర్ శేషన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ఏబీఎన ఆంధ్రజ్యోతి జనవరిలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా..’ కార్యక్రమం నిర్వహించి ఈ రెండు కాలనీల్లో పలు సమస్యలను వెలుగులోకి తెచ్చిందన్నారు. వచ్చిన సమస్యలను నగర పాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సుమారు రూ.3 కోట్లతో నందమూరినగర్, వైఎస్సార్ నగర్ పరిధిలోని రోడ్లు, 25 డ్రైనేజీలను నిర్మించామన్నారు. భవిష్యతలో రూ.3 కోట్లతో కుందునది బ్రిడ్జి నిర్మాణం చేస్తామన్నారు. అదేవిధంగా నందమూరినగర్‌లో రూ.90 లక్షలతో సీసీ రోడ్డు, వైఎస్సార్‌నగర్‌లో రూ. 60 లక్షలతో సీసీ రోడ్డును కూడా వేయడం జరుగుతుందన్నారు. రూ.9 లక్షలతో శ్మశాన వాటిక పనులకు టెండర్ పక్రియ నిర్వహిస్తున్నామన్నారు. మున్పిపల్ పార్కు సదుపాయం కల్పిస్తామన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికి ఇంటి పన్నులు రశీదులు ఇస్తామన్నారు. ప్రధానంగా ఈ రెండు కాలనీల్లో ప్రజలకు రక్షణగా 4వ పట్టణ పోలీసు స్టేషన ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనఎండీ ఫీరోజ్ మాట్లాడుతూ కాలనీల్లో సమస్యలను విడతల వారిగా పరిష్కారిస్తామన్నారు. సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ప్రతి వార్డు, గల్లీలోను రోడ్డు, డ్రైనేజీలు వేస్తామన్నారు. వచ్చే ఆరు నెలల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేసి వార్డులో సమస్యలు లేకుండా చేస్తామన్నారు. పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పరితపించే ఏబీఎన ఆంధ్రజ్యోతికి ప్రత్యేకఽ ధన్యవాదాలు తెలియజేశారు.
నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న మాట్లాడుతూ వార్తలే కాదు.. ప్రజల సమస్యలు గుర్తించి వాటి పరిష్కారం కోసం ఏబీఎన ఆంధ్రజ్యోతి ఇలాంటి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. ఇప్పటికే గుర్తించిన పలు సమస్యలను పరిష్కారించామన్నారు. అనంతరం కాలనీ ప్రజలు తెలియజేసిన ఫిర్యాదులను మంత్రి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్, ఆంధ్రజ్యోతి మేనేజర్ ఆకుల లక్ష్మణ్, ఎడిషన ఇనచార్జి చల్లా నవీన కుమార్ నాయుడు, డీసీఎం సోమశేఖర్ రెడ్డి, ఏడీవీటీ ఇనచార్జి గోపాల్, ఏబీఎన సుంకన్న, నంద్యాల స్టాఫ్ రిపోర్టర్ చదువుల గోపాలకృష్ణ, వార్డు ఇనచార్జిలు బుగ్గరాముడు, శివనాగిరెడ్డి, టీడీపీ నగర అధ్యక్షులు ఖలీల్, సీనియర్ న్యాయవాది బాబురావు, మహిళా అధ్యక్షురాలు విజయగౌరి, ఉషారాణి, యువనాయకుడు తదితరులు పాల్గొన్నారు.
ఫ ఆంధ్రజ్యోతినే సమస్యలు పరిష్కారం
- బుగ్గరాముడు, టీడీపీ వార్డు ఇనచార్జి, వైఎస్సార్ కాలనీ
అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమం వైఎస్సార్ కాలనీలో గత జనవరిలో నిర్వహించి పలు సమస్యలను గుర్తించి వెలుగులోకి తీసుకురావడంతో నే పరిష్కారమయ్యాయి. రోడ్లు,డ్రైనేజీలు నిర్మించి కాలనీ వాసులకు ఇబ్బంది లేకుండా చేశారు. ఇంటి పన్ను సమస్య మాత్రమే ఉంది. వెంటనే పరిష్కారించి పేదలకు అండగా ఉండాలని మంత్రి ఫరూక్‌ను కోరారు. ప్రజల పక్షాన నిలిచిన ఆంధ్రజ్యోతికి, సమస్యలను పరిష్కరించిన మంత్రికి కృతజ్ఞతలు.
ఫ అర్హులకు ఇంటి పన్ను కల్పించాలి
- శివనాగిరెడ్డి, వార్డు ఇనచార్జి
కాలనీలో నివాసం ఉండి అర్హులైన ప్రతిఒక్కరికి ఇంటి పన్ను సదుపాయం కల్పించాలి. ఏబీఎన ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో పలు సమస్యలు పరిష్కారమయ్యాయి. మంత్రి ఫరూక్, ఆయన కుమారుడు ఫిరోజ్ సహాకారంతో మా కాలనీలు మరింత అభివృద్ధి చెందాలి.
ఫ హెల్త్ సెంటర్‌లో సిబ్బంది కొరత : విజయగౌరి
ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏబీఎన ఆంధ్రజ్యోతి తలపెట్టిన అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమంలో పేద ప్రజలకు ఎంతో దోహదపడింది. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న సమస్యలు పరిష్కారమయ్యాయి. వైఎస్సార్ అర్బన హెల్త్ సెంటర్‌లో సిబ్బంది కొరత ఉంది.. పరిష్కరించాలి.
ఫ పేద విద్యార్థులకు అండగా : ఉషారాణి
కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో పేద విద్యార్థులకు ఎంతో అండగా ఉంది. పేద తల్లిదండ్రులు సైతం ఎంతో సంతోషిస్తున్నారు. ఇదే తరహాలో పేద ప్రజల సమస్య పరిష్కారం కోసం ఏబీఎన ఆంధ్రజ్యోతి కూడా తమ వంతు సాయంగా కార్యక్రమాలు చేయడం అభినందనీయం.
ఫ సమస్యల పరిష్కార వేదిక : ఖలీల్
ప్రజలకు.. ప్రభుత్వానికి వారదిగా ఉండటంతో పాటు సమస్యలను గుర్తించి.. వాటి పరిష్కారం కోసం నడుంబిగించి ఏబీఎన ఆంధ్రజ్యోతికి కృతజ్ఞతలు. పేదల సమస్యలను తీర్చడం కోసం ఏర్పాటు చేసిన చక్కని వేదిక ఇది. వైఎస్సార్‌నగర్, నందమూరి నగర్‌లో ఏళ్ల తరబడి ఉన్న సమస్యలు కూడా పరిష్కారం కావడం సంతోషంగా ఉంది.
ఫ పింఛన ఇప్పిచండి సార్ : హుస్సేన బీ
నా భర్త చనిపోయి ఏడాది కావస్తోంది. ఇప్పటి వరకు పింఛన రాలేదు. మాపై దయవుంచి నాకు పింఛన వచ్చేలా చూడాలని మంత్రిని కోరారు. దీంతో మంత్రి స్పందించి సంబంధిత అధికారులకు వెంటనే పరిష్కారించాలని అదేశించారు.
ఫ ఇంటికి పన్ను వేయించండి : సావిత్రి
వేరే వాళ్ల దగ్గర నుంచి ఇంటి పట్టాను కొనుగోలు చేశాను. నా పేరు ఇంటి పట్టాతో పాటు ఇంటి పన్ను వచ్చేలా చూడాలని మంత్రిని కోరారు. గతంలో పలుమార్లు అడిగినా పట్టించుకోలేదు. అదేవిధంగా కాలనీలో రాత్రి వేళల్లో వైద్యులు ఉండటం లేదు. రాత్రి వేళ కూడా వైద్యం అందించేలా చూడాలని మంత్రిని కోరారు. దీంతో స్పందించి త్వరలోనే సమస్యను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు.
ఫ తల్లికి వందనం కోల్పోయాను: శివ
నా పేరు మీద నా ఇంటికి మూడు పన్నులు వేయడంతో నా పిల్లలకు తల్లికి వందనం కింద నగదు జమ కాలేదు. అఽధికారులు చేసిన తప్పునకు మాకు తల్లి వందనం రాకుండా పోయింది. కావున మా సమస్యను పరిష్కారించాలని మంత్రిని కోరారు.
ఫ కమ్యూనిటీ హల్ ఏర్పాటు చేయాలి: సురేష్‌కుమార్, ఫాస్టర్
వైఎస్సార్ నగర్‌లో కమ్యునిటీ హాల్ ఏర్పాటు చేయాలి. వైఎస్సార్‌నగర్ మొయినరోడ్డులో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. స్పీడ్ బ్రేకర్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. దొంగతనాలు జరగకుండా పోలీసు నిఘా పెంచాలి. వీధిలైట్లు ఏర్పాటు చేయాలి. క్రైస్తవులు కూటీమి ప్రభుత్వం కోసం ప్రార్థనలు చేశాం.
ఫ ముగ్గురు పిల్లలకు తల్లికి వందనం : పద్మ
సీఎం చంద్రబాబు అందించిన తల్లికి వందనంతో మా ముగ్గురు పిల్లలకు రూ.39 వేలు పడింది. కూటమి ప్రభుత్వానికి ఎప్పటికి మా కుటుంబం రుణపడి ఉంటుంది. పేద పిల్లల చదువుకు ఎంతో ఉపయోగకరం.
ఫ పైప్ లైన లీక్‌తో ఇళ్లలోకి నీరు: షరీఫ్
రహదారి పక్కనే పైప్ లైన లీక్ కావడంతో ఇళ్లలోని నీరు వస్తోంది. పక్కనే డ్రైనేజీ కాలువు కూడా ఉండటంతో కలుషితం అవుతోంది. కావున కొత్త పైప్‌లైన వైసి కాలనీలో సమస్య లేకుండా చేయాలని మంత్రిని కోరారు.