MLA Kotam Reddy Sridhar Reddy: బెదిరింపులకు భయపడను
ABN , Publish Date - Aug 31 , 2025 | 04:56 AM
రాజకీయ ప్రత్యర్థుల బుడ్డ బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. రౌడీషీటర్ల సంభాషణ వెనుక వైసీపీ హస్తం ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు.
విద్యార్థి దశ నుంచే ఎన్నో చూశా..: కోటంరెడ్డి
రౌడీషీటర్ల సంభాషణల వెనుక వైసీపీ ఉందేమో!
నెల్లూరు రూరల్, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): రాజకీయ ప్రత్యర్థుల బుడ్డ బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. రౌడీషీటర్ల సంభాషణ వెనుక వైసీపీ హస్తం ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. నెల్లూరులో శనివారం ఆయన మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే అనేక హెచ్చరికలు చూశానన్నారు. 25 ఏళ్లపాటు రాజ్యాధికారం తనదేనంటూ విర్రవీగిన జగన్‌ను, అధికారాన్ని వదులుకుని 16 నెలలు ముందుగానే వైసీపీ నుంచి బయటకు వచ్చానని గుర్తుచేశారు. రౌడీషీటర్ల సంభాషణ చూసి దిగ్ర్భాంతికి గురయ్యానన్నా రు. అయితే ఇది గిరిధర్‌రెడ్డి కుట్రం టూ వైసీపీ శ్రేణులు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. అ లాంటి సంస్కృతి తమ ఇంటా వం టా లేదన్నారు. కుటుంబ సభ్యులను చంపుకోవాల్సిన కర్మ తనకు పట్టలేదని, అది వైసీపీ నాయకులకే అలవాటని.. ఇలాంటి ఆలోచనలు వైసీపీ డీఎన్‌ఏలోనే ఉన్నాయని దుయ్యబట్టారు. జూలై 1న రౌడీషీటర్లు మాట్లాడుకున్న వీడియో తాజాగా బయటకు రావడం, ఆ వీడియో తన దృష్టికి మూడు రోజుల ముందే వచ్చిందని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ప్రకటించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమాచారం తనకివ్వకపోవడంతో అసంతృప్తిగా ఉన్నానన్నారు. ఈ ఘటనపై హోం మంత్రి అనిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఫోన్ చేసి పరామర్శించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ‘నన్ను చంపితే డ బ్బే, డబ్బంటూ రౌడీషీటర్లు చెప్పడం ఆశ్చర్యం కలిగించిం ది. ఆ డబ్బు వారికి ఎవరిస్తానన్నారు? ఆ అవసరం ఏ ముందో నిజాలను లోతుగా విచారించాల్సిన బాధ్యత జిల్లా పోలీసు శాఖపై ఉంది. తాజాగా బయటకు వచ్చిన బెదిరింపులతో శ్రేణులెవరూ ఆందోళన చెందవద్దు. జాగ్రత్తలు తీసుకుంటున్నాను’ అని ఎమ్మెల్యే తెలిపారు. శ్రీధర్‌రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు కార్యాలయానికి వచ్చిన మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా పోలీసు యంత్రాంగం రౌడీషీటర్ల అంతు చూడాలని సూచించారు.