Suicide Prevention: ఆత్మహత్య చేసుకుంటున్నా!
ABN , Publish Date - Apr 15 , 2025 | 04:16 AM
తన తమ్ముడు ఆత్మహత్య చేసుకోబోతున్నాడని యువతి ఇచ్చిన సమాచారం మేరకు తిరుమల పోలీసులు వెంటనే స్పందించి మునిసాత్విక్ ప్రాణాలు కాపాడారు. మానసికంగా అస్వస్థతతో ఉన్న అతడిని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్‌లోని అక్కకు తమ్ముడి ఫోన్.. ఆపై భవనంపైకి ఎక్కిన వైనం
ఆమె ఫోన్‌తో పది నిమిషాల్లోనే కాపాడిన తిరుమల పోలీసులు
తిరుమల, ఏప్రిల్14(ఆంధ్రజ్యోతి): తన తమ్ముడు ఆత్మహత్య చేసుకోబోతున్నాడంటూ ఓ యువతి రోదిస్తూ హైదరాబాద్ నుంచి తిరుమ ల పోలీసులకు సమాచారమిచ్చింది. ఎలాగైనా కాపాడాలంటూ ప్రాధేయపడింది. సకాలంలో పోలీసులు కూడా స్పందించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. తిరుమలలో సోమవారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. తిరుమల టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నానికి చెందిన మునిసాత్విక్(25) తన దగ్గరి బంధువు నరే్‌షతో కలిసి నాలుగురోజుల క్రితం తిరుమలకు వచ్చాడు. తర్వాత మునిసాత్విక్ కనిపించకుండా పోయాడు. సోమవారం వేకువజామున 4 గంటల సమయంలో మునిసాత్విక్ హైదరాబాద్‌లోని తన అక్క స్వర్ణరేఖకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు సమాచారమిచ్చి ఫోన్ పెట్టేశా డు. దీంతో స్వర్ణరేఖ తిరుమల టూటౌన్ పోలీసులకు ఫోన్ చేసి విషయాన్ని వివరించింది. వారు స్పందించి సెల్‌ఫోన్ లోకేషన్ ద్వారా తిరుమలలోని కల్యాణి సత్రాలపై మునిసాత్విక్ ఉన్నట్టు గుర్తించి, దూకేందుకు సిద్ధంగా ఉన్న మునిసాత్విక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి మానసిక స్థితి సక్రమంగా లేదని గుర్తించి తిరుపతిలోకి స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Visakhapatnam: మరో 24 గంటల్లో డెలివరీ కానున్న భార్య.. భర్త ఎంత దారుణానికి ఒడికట్టాడో..
PM Narendra Modi: కంచ గచ్చిబౌలి భూములు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ..