Visakhapatnam crime: భార్యనూ.. కడుపులోని బిడ్డనూ చిదిమేశాడు
ABN , Publish Date - Apr 15 , 2025 | 03:46 AM
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను, తల్లిదండ్రులకు విషయం తెలిసిపోతుందన్న భయంతో జ్ఞానేశ్వర్ గొంతునులిమి హత్య చేశాడు. ప్రసవానికి కొన్ని గంటల ముందు ఈ దారుణం జరగడం విషాదం. పోలీసులు నిందితుణ్ణి అరెస్ట్ చేశారు.

మరికొద్ది గంటల్లో ప్రసవం కానున్న భార్య
గొంతుకు చున్నీ బిగించి చంపిన ఉన్మాది
రెండేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. విశాఖలో రహస్య కాపురం
బిడ్డను కంటే ఇంట్లోవాళ్లకు తెలిసిపోతుందనే ఘాతుకం
మహారాణిపేట(విశాఖపట్నం), ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): మరికొద్ది గంటల్లో ప్రసవం కానున్న భార్యను గొం తు నులిపి చంపేశాడో ఉన్మాది. ప్రేమిం చి పెళ్లి చేసుకుని.. రహస్యంగా కాపురం పెట్టిన అతడు.. ఆ విషయం తన తల్లిదండ్రులకు ఎక్కడ తెలిసిపోతుందోనని ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సమాచా రం. ఈ ఉన్మాదిని విశాఖ పీఎం పాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం అడ్డురోడ్డు ప్రాంతానికి చెందిన కేదారశెట్టి అనూష(27) హోటల్ మేనేజ్‌మెంట్ చేసింది. విశాఖ జిల్లా కూర్మన్నపాలేనికి చెందిన గెడ్డాడ జ్ఞానేశ్వర్(29) సాగర్‌నగర్ సమీపంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్నాడు. మరోవైపు హిందూస్థాన్ స్కౌ ట్స్ అండ్ గైడ్స్‌లో ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. అనూష స్నేహితురాలి ద్వారా ఆమెకు పరిచయమయ్యాడు. ఇద్దరూ ప్రేమించుకుని 2022 డిసెంబరు 10న కొంతమంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పీఎం పాలెం వుడా కాలనీలో కాపురం పెట్టారు. జ్ఞానేశ్వర్ వివాహం చేసుకున్నట్టు ఇంతవరకూ తన తల్లిదండ్రులకు తెలపలేదు. వారికి విషయం చెప్పాలని అనూష ఎన్నిసార్లు ఒత్తిడి తెచ్చినా.. పిల్లలు పుట్టాక చెబుదామని కాలయాపన చేశాడు. ఈ క్రమంలో అనూష గర్భం దాల్చింది. నెలలు నిండాయి. ఏప్రిల్ 14న ప్రసవమవుతుందని, ఒకరోజు ముందు ఆస్పత్రిలో చేరాలని వైద్యులు సూచించారు.
అయితే.. ‘ఆదివారం ఎందుకు? సోమవారం ఉదయం వెళదామ’ని జ్ఞానేశ్వర్ అనూషకు నచ్చజెప్పాడు. ఆదివారం రాత్రి అనూష తన స్నేహితులతో ఫోన్‌లో ఎంతో సంతోషంగా మాట్లాడింది. కానీ.. ఉదయం 7.30 గంటల సమయంలో ఆమె సన్నిహితులు, స్నేహితులకు జ్ఞానేశ్వర్ ఫోన్ చేసి అనూష ఎలాంటి చలనం లేకుండా పడి ఉందని తెలిపాడు. వారు వచ్చిన తర్వాత ముందుగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్టు వైద్యులు గుర్తించి కేజీహెచ్‌కు తీసుకువెళ్లాలని సూచించారు. అక్కడి వైద్యులు ఆమె మృతిని నిర్ధారించారు. అనూష మెడ పై కమిలిన గుర్తులు ఉండడంతో స్నేహితులు అనుమానం వ్యక్తం చేశారు. జ్ఞానేశ్వర్ చేతులు, ముఖంపై గోళ్ల గీతలు, రక్తపు చారలు ఉండడంతో పాటు మృతదేహాన్ని తీసుకువెళ్లిపోయేందుకు హడావుడి పడుతుండడంతో కేజీహెచ్ ఔట్‌పోస్టు పోలీసులకు అనుమానం వచ్చింది. వారు తమదైన శైలిలో గదమాయించగా.. అనూషను చున్నీతో పీక నులిమి చంపినట్టు నేరాన్ని అంగీకరించాడు.
ఈ వార్తలు కూడా చదవండి:
Visakhapatnam: మరో 24 గంటల్లో డెలివరీ కానున్న భార్య.. భర్త ఎంత దారుణానికి ఒడికట్టాడో..
PM Narendra Modi: కంచ గచ్చిబౌలి భూములు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ..