Share News

హుండీ ఆదాయం రూ.10.30 కోట్లు

ABN , Publish Date - Oct 08 , 2025 | 01:13 AM

దుర్గామల్లేశ్వర దేవస్థానంలో జరిగిన దసరా మహోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారిని దర్శించు కున్న భక్తులు సమర్పించిన హుండీల ఆదాయం రూ.10,30,95,521 వచ్చింది.

 హుండీ ఆదాయం రూ.10.30 కోట్లు

- దుర్గగుడిలో దసరా ఉత్సవాల హుండీల లెక్కింపు

- బంగారం 387 గ్రాములు.. వెండి 19.450 కేజీలు

- వివరాలు వెల్లడించిన ఈవో శీనానాయక్‌

ఇంద్రకీలాద్రి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి):

దుర్గామల్లేశ్వర దేవస్థానంలో జరిగిన దసరా మహోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారిని దర్శించు కున్న భక్తులు సమర్పించిన హుండీల ఆదాయం రూ.10,30,95,521 వచ్చింది. ఈ వివరాలను ఈవో వి.కె.శీనానాయక్‌ మంగళవారం వెల్లడించారు. మహా మండపం ఆరవ అంతస్తులో భక్తులు సమర్పించిన కానుకలను అధికారులు రెండు రోజుల పాటు లెక్కించారు. మొదటి రోజు సోమవారం రూ.3,57,92,708 నగదు, 122 గ్రాముల బంగారు ఆభరణాలు, 9 కేజీల 700 గ్రాముల వెండి ఆభరణాలు లభించాయి. ఇంకా వివిధ దేశాల కరెన్సీలు భక్తులు అమ్మవారికి సమర్పించారు. రెండవ రోజు మంగళవారం 56 హుండీలు, 243 సంచులలో కానుకలు లెక్కించగా రూ.6,73,02,813 నగదు, 265 గ్రాముల బంగారు ఆభరణాలు, 9 కేజీల 750 గ్రాముల వెండి ఆభరణాలు లభించాయి. రెండు రోజుల పాటు 106 హుండీలు, 480 సంచులలో కానుకలను లెక్కించగా మొత్తం రూ.10,30,95,521 నగదు, 387 గ్రాముల బంగారు ఆభరణాలు, 19 కేజీల 450 గ్రాముల వెండి ఆభరణాలు లభించాయి. ఈ కార్యక్రమంలో ఏసీ రంగారావు, ఏఈవోలు బి.వెంకటరెడ్డి, ఎన్‌.రమేష్‌ బాబు, వాసు, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

తగ్గిన ఆదాయం

గతేడాది దసరా ఉత్సవాలు 10 రోజులతో పాటు మరో ఐదు రోజులు అదనంగా భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా మొత్తం రూ.9,32,94,018 ఆదాయం లభించింది. అయితే ఈ ఏడాది సెప్టెంబరు 22 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు ఉత్సవాలు జరిగాయి. అధికారులు గత నెల 20వ తేదీ నుంచి ఈ నెల 5వ తేదీ వరకు భక్తులు సమర్పించిన 16 రోజుల పాటు కానుకలను లెక్కించగా, మొత్తం రూ.10,30,95,521 ఆదాయం లభించింది. ఈ లెక్కన గత ఏడాది కంటే సుమారు కోటి రూపాయల ఆదాయం తక్కువగా వచ్చింది.

Updated Date - Oct 08 , 2025 | 01:15 AM