Share News

కాలువలు ఇలా..నీరు పారేదెలా?

ABN , Publish Date - Jun 02 , 2025 | 12:13 AM

మం డలంలోని కేసీ కెనాల్‌ పంట కాలువలు పూ ర్తిగా పిచ్చి మొక్కలతో నిండిపోయి అధ్వానం గా మారాయి.

 కాలువలు ఇలా..నీరు పారేదెలా?
కాలువ ఇలా

అధ్వానంగా కేసీ పంట కాలువలు

చివరి ఆయకట్టుకు అందని నీరు

ఆందోళనలో రైతులు

చాగలమర్రి, జూన 1 (ఆంధ్రజ్యోతి): మం డలంలోని కేసీ కెనాల్‌ పంట కాలువలు పూ ర్తిగా పిచ్చి మొక్కలతో నిండిపోయి అధ్వానం గా మారాయి. సైడ్‌వాల్‌ పూర్తిగా దెబ్బ తి న్నాయి. పంట కాలువ పనుల్లో నాణ్యత లోపించడంతో బీటలు వారి నీరు వృఽథాగా పో తున్నాయి. దీంతో చివరి ఆయకట్టుకు సాగు నీరు అందడం లేదు. మల్లెవేముల గ్రామ స మీపంలో ప్రధాన కాలువ నుంచి పంట పొ లాలకు నీరందించే డిసి్ట్రబ్యూటర్‌ చానల్‌ పను లు అసంపూర్తిగా నిలిచిపోయాయి. 300 ఎకరాలకు సాగునీరు అందిం చాల్సి ఉండగా 30 ఎకరాలకు మాత్రమే నీరు అందుతుం దని రైతులు చెబుతున్నారు. చివరి ఆయక ట్టు వరకు డ్రైనేజీ పనులు చేస్తే రైతులకు ప్ర యోజనకరంగా ఉంటుంది. జంగాలపల్లె కేసీ ప్రధాన కాలువ నుంచి చేపట్టిన లైనింగ్‌ పను లు సరిగా చేయక పోవడంతో నీరు లీకేజీ కా వడంతో పంట పొలాలు నీట మునిగి దెబ్బతింటున్నాయని రైతులు వాపోతున్నారు. మూడేళ్లుగా కేసీ కాలువ లీకేజీ నీటితో సాగు చేసిన పంటలు నీట మునిగి దెబ్బతింటున్నా యని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పది వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. అధికారులు స్పందించి దెబ్బతిన్న పంట కాలువలకు మరమ్మతులు చేపట్టి అసంపూర్తి గా ఉన్న కాలువలను పూర్తి చేయించి చివరి ఆయకట్టుకు నీరందేలా చూడాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

నీరు అందడం లేదు

కాలువలు అధ్వానంగా ఉన్నాయి. చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. లైనింగ్‌ దెబ్బతిని పిచ్చి మొక్కలు మొలచి అధ్వానంగా ఉన్నాయి. కాలువలు మరమ్మతులు చేసి నీరు లికేజీ కాకుండా చూడాలి. అసంపూర్తిగా ఉన్న కాలువలను పూర్తి చేసి సాగునీరు అందించాలి.

ఫ మల్లారెడ్డి, రైతు, మల్లెవేముల

లైనింగ్‌ పనులు చేపట్టాలి

మల్లెవేముల కేసీ కెనాల్‌ లైనింగ్‌ పనులు చేపట్టాలి. కేసీ ప్రధాన కాలువ నుంచి చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. కాలువలంతా ముళ్ల కంపలతో, పూడికతో నిండుకుంది. కొన్ని చోట్ల కాలువలు దెబ్బతిని గోడలు కుప్పకూలాయి. కాలువలు సరిగా లేక పోవడంతో సాగునీరు అందడం లేదు. చెంతనే నీరు ఉన్నా ప్రయోజనం లేదు.

రామకృష్ణారెడ్డి, రైతు, మల్లెవేముల

Updated Date - Jun 02 , 2025 | 12:13 AM