Share News

ఆలయ భూములను ఎలా కట్టబెడతారు?

ABN , Publish Date - May 12 , 2025 | 11:55 PM

గ్రామ సభలు లేకుండా, రైతు ల అనుమతి లేకుండా దేవాలయ భూములను సిమెంట్‌ పరిశ్రమ ల కు ఎలా కట్టబెడతారని సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, జిల్లా రైతు సంఘం నాయకులు సోమన్న ప్రశ్నించారు.

ఆలయ భూములను ఎలా కట్టబెడతారు?
తహసీల్దార్‌కు వినతిపత్రం అందిస్తున్న సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, రైతులు

- భూములిచ్చిన రైతులను మోసం చేస్తున్న సిమెంట్‌ కంపెనీలు

- సీపీఐ జిల్లా నాయకులు, రైతుల నిరసన

కొలిమిగుండ్ల, మే 12 (ఆంధ్రజ్యోతి) : గ్రామ సభలు లేకుండా, రైతు ల అనుమతి లేకుండా దేవాలయ భూములను సిమెంట్‌ పరిశ్రమ ల కు ఎలా కట్టబెడతారని సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, జిల్లా రైతు సంఘం నాయకులు సోమన్న ప్రశ్నించారు. కల్వటాల గ్రామానికి చెందిన దేవాలయ భూములను రామ్‌కో సిమెంట్‌ పరిశ్రమకు కౌలుకు అప్పగించ డంపై స్థానిక రైతులతో కలిసి సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్‌ బాలీశ్వర రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సిమెంట్‌ పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యంతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్పిన పరిశ్రమ వర్గాలు ఇప్పటి వరకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిజం, అలా్ట్రటెక్‌, పెన్నా, రామ్‌కో సిమెంట్‌ పరిశ్రమల ఏర్పాటు సమయంలో ఇచ్చిన హామీలను మరిచాయని ఆరోపించారు. వెంటనే పాఠశాలలు, ఆస్పత్రులు నిర్మించాలని సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రైతులు పుల్లయ్య, గుజ్జల పెద్దయ్య, శరతరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2025 | 11:55 PM