అర్హులందరికీ గృహాలు మంజూరు
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:25 AM
అర్హులైన పేదలందరికీ గృహాలను మంజూరు చేస్తామని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి భరోసా ఇచ్చారు.
ఇళ్ల నిర్మాణాలకు నాలుగు దశల్లో
బిల్లులు చెల్లింపు
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
ఆత్మకూరు, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): అర్హులైన పేదలందరికీ గృహాలను మంజూరు చేస్తామని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో పీఎంఏవై - 2.0 కింద 272 మందికి మంజూరైన గృహనిర్మాణాల హామీ పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పీఎంఏవై-2.0 ద్వారా ప్రభుత్వం అర్బన ఏరియాల్లో రూ.2.5లక్షల సాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.1.5లక్షలు ఇస్తుండగా, రాష్ట్ర వాటాగా రూ.లక్ష సాయాన్ని అందిస్తున్నట్లు వివరించారు. ఈ మొత్తాన్ని నాలుగు విడదల్లో చెల్లింపులు చేయనున్నట్లు చెప్పారు. లబ్దిదారులు నిర్ధేశించిన గడువులోగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో హౌసింగ్ ఈఈ హరిగోపాల్, ఆర్డీవో నాగజ్యోతి, తహసీల్దార్ రత్నరాధిక, ఇనచార్జ్ ఎంపీడీవో ఉమర్, మున్సిపల్ చైర్మన డాక్టర్ మారూఫ్ ఆసియా, ఎంపీపీ తిరుపాలమ్మ, సొసైటీ చైర్మన షాబుద్దిన, టీడీపీ మండల, పట్టణాధ్యక్షులు రవీంద్రబాబు, వేణుగోపాల్, నాయకులు శివప్రసాద్‌రెడ్డి, అబ్దుల్లాపురం బాషా తదితరులున్నారు.
చెత్త సేకరణ ట్రాక్టర్ల ప్రారంభం
స్వచ్ఛ భారత పథకం ద్వారా ఆత్మకూరు మున్సిపాలిటీతో పాటు మండలంలోని కరివేన, వడ్లరామాపురం, కురుకుంద గ్రామాలకు నూతనంగా మంజూరైన చెత్త సేకరణ ట్రాక్టర్లను బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెత్త సేకరణ ట్రాక్టర్ల ద్వారా స్వచ్చభారత లక్ష్యాలు నెరవేరాలని ఆకాంక్షించారు.
నందికొట్కూరు పట్టణంలో..
నందికొట్కూరు: పీఎంఏవై పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహాలను మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. బుధవారం పట్టణంలోని కోటా వీధిలో పీఎంఏవై ద్వారా నూతనంగా నిర్మించుకున్న గృహా ప్రారంభోత్సవంతో పాటు, నూతనంగా మంజూరు అయిన గృహాల అనుమతి పత్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ కన్వీనర్ భాస్కర్‌రెడ్డి, మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్‌రెడ్డి, మార్కెట్ యార్డు ఛైర్మన వీరం ప్రసాద్‌రెడ్డి, సహకార సొసైటీ ఛైర్మన ముర్తుజావలి, కౌన్సిలర్లు జాకీర్ హుస్సేన, చిన్నరాజు, టీడీపీ నాయకులు జమీల్, శాలు తదితరులు పాల్గొన్నారు.
నంద్యాల పట్టణంలో..
నంద్యాల కల్చరల్: పేదలందరికీ ఇళ్ల నిర్మాణ పఽథకం కింద నిధులు మంజూరుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలుగుయువత నాయకుడు ఎనఎండీ ఫయాజ్ అన్నారు. బుధవారం పట్టణంలో తెలుగుపేటలోని హరిజనవాడలో కత్తి సుబ్బలక్ష్మమ్మ, కత్తి సుబ్బరాయుడు దంపతుల గృహప్రవేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఇంటితాళాలు ఇచ్చారు. కార్యక్రమంలో తెలుగుదేశం వార్డు ఇనచార్జి వెంకట్, హౌసింగ్ సిబ్బంది సిద్దిఖ్, విష్ణువర్ధనరెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.