Minister Kolusu Parthasarathi: అర్హులందరికీ ఇళ్లు
ABN , Publish Date - Dec 16 , 2025 | 03:26 AM
కూటమి పాలనలో రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహాలు నిర్మిస్తాం. ఐదేళ్ల పాలనలో 9 లక్షల గృహాలు నిర్మించి ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది......
4 లక్షల గృహ లబ్ధిదారులకు మొండిచెయ్యి చూపించిన జగన్: కొలుసు, అనగాని
రేపల్లె, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): ‘కూటమి పాలనలో రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహాలు నిర్మిస్తాం. ఐదేళ్ల పాలనలో 9 లక్షల గృహాలు నిర్మించి ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది’ అని బాపట్ల జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. బాపట్ల జిల్లా లంకేవానిదిబ్బ గ్రామంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, వీఆర్‌వో సంస్థ సంయుక్త సహకారంతో నిర్మితమవుతున్న 39 పీఎంఏవై గృహాలకు సోమవారం మంత్రులు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి పార్థసారథి మాట్లాడారు. ‘కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో 9 లక్షల గృహాలను నిర్మించి పేదవారిని ఆదుకుంటుంది’ అని అన్నారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, ‘జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో చేసిన తప్పులు ఒక దాని తరువాత ఒకటి వెలుగు చూస్తున్నాయి. వీటిపై ప్రజలు చర్చించుకుంటున్నారనే భయంతో వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది’ అన్నారు. అనంతరం గిరిజనుల సామాజిక సభామందిరాన్ని ప్రారంభించారు.