ఇంటిపన్నుల వసూళ్లు రూ.67.71 కోట్లు
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:54 AM
జిల్లాలోని 25 మండలాల్లోని 497 పంచాయతీల్లో ఇంటిపన్నులు, ఇతరత్రా పన్నులను 80 శాతం వసూలు చేసినట్టు కృష్ణాజిల్లా పంచాయతీ అధికారి జే అరుణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

మచిలీపట్నం, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 25 మండలాల్లోని 497 పంచాయతీల్లో ఇంటిపన్నులు, ఇతరత్రా పన్నులను 80 శాతం వసూలు చేసినట్టు కృష్ణాజిల్లా పంచాయతీ అధికారి జే అరుణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 ఆర్థికసంవత్సరానికి సంబంధించి జిల్లాలో రూ.84.63 కోట్ల మేర ఇంటిపన్నులు, ఇతరత్రా పన్నులు వసూలు చేయాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు రూ.67.71 కోట్లను వసూలుచేసినట్టు తెలిపారు. మండలాల వారీగా పన్నుల వసూలు వివరాలిలా ఉ న్నాయి. అవనిగడ్డ మండలంలో రూ.1.11 కోట్లు, బంటుమిల్లిలో రూ.1.10కోట్లు, బాపులపాడులో రూ.5.21 కోట్లు, చల్లపల్లిలో రూ.2.51 కోట్లు, గన్నవరంలో రూ.7.20 కోట్లను ఇంటిపన్నులు, ఇతరత్రా పన్నులు వసూలు చేశామన్నారు. ఘంటసాల మండలంలో రూ.1.27 కోట్లు, గుడివాడలో రూ.1.15 కోట్లు, గుడ్లవల్లేరులో రూ.1.93 కోట్లు, గూడూరులో రూ.1.06 కోట్లు, కంకిపాడులో రూ.5కోట్లు, కోడూరులో రూ.80లక్షలు, కృత్తివెన్నులో రూ.కోటి, మచిలీపట్నంలో రూ1.39 కోట్లను వసూలు చేసినట్టు తెలిపారు. మోపిదేవిలో రూ.77లక్షలు, నాగాయలంకలో రూ.1.02 కోట్లు, నందివాడలో రూ.1.14 కోట్లు, పామర్రులో రూ.2.45 కోట్లు, పమిడిముక్కలలో రూ.1.13 కోట్లు, పెడనలో రూ. 63లక్షలు వసూలు చేసినట్టు తెలిపారు. పెదపారుపూడిలో రూ.72 లక్షలు, పెనమలూరులో రూ.3.51 కోట్లు, తోట్లవల్లూరులో రూ.1.05 కోట్లు, ఉంగుటూరులో రూ.2.31 కోట్లు, ఉయ్యూరులో రూ.1.40 కోట్లను ఇంటిపన్నులుగా వసూలు చేసినట్టు ఆమె తెలిపారు. ఆన్‌లైన్‌లో పన్నుల చెల్లింపునకు జిల్లాలోని 48 పంచాయతీలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికచేసి క్యూఆర్ డిస్‌ప్లే మిషన్లు ఉపయోగించి ఆన్‌లైన్ పోర్టల్‌లో ఇంటి పన్నులు, ఇతరత్రాపన్నులను వసూలు చేస్తున్నట్టు డీపీవో తెలిపారు.