అవార్డు గ్రహీతలకు సన్మానం
ABN , Publish Date - Sep 27 , 2025 | 11:36 PM
రాష్ట్రస్థాయిలో అవార్డులు అందుకున్న ఉత్తమ ఉపాధ్యాయులు అవ్వారి శేషఫణి, పీవీ సుబ్బయ్యలను సన్మానించారు.
నంద్యాల కల్చరల్, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయిలో అవార్డులు అందుకున్న ఉత్తమ ఉపాధ్యాయులు అవ్వారి శేషఫణి, పీవీ సుబ్బయ్యలను సన్మానించారు. శనివారం పట్టణంలోని రైతు సమాఖ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాతృభాషా పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ దివి హయగ్రీవాచార్యులు సన్మానించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రనాథ్, చిన్నయసూరి సాహితీ సమితి అఽధ్యక్షులు డా. వైష్టవ వెంకటరమణమూర్తి, ఉపాధ్యాయం సంఘం నాయకులు ముత్తోజు వీరబ్రహ్మం, వివిధ సామాజిక, సాహితీ సంస్ధల ప్రతినిధులు అన్నెం శ్రీనివాసరెడ్డి, కిషోర్‌కుమార్, డా.నీలం వెంకటేశ్వర్లు, మాబుబాషా, నీలకంఠమాచారి, నందిరైతు సమాఖ్యప్రతినిధులు, కృష్ణారెడ్డి, మధుసూదనరెడ్డి, ఉపాధ్యాయులు నరేంద్ర, ప్రసాద్, బాలసుబ్బయ్య పాల్గొన్నారు.