Justice Tuhin Kumar: హోమ్ వర్క్.. హార్డ్ వర్క్‌తో విజయం
ABN , Publish Date - Aug 06 , 2025 | 04:58 AM
కేసుకు సంబంధించి హోమ్ వర్క్, కొంతహార్డ్ వర్క్ చేస్తే విజయం మీ సొంతమవుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తుహిన్ కుమార్ అన్నారు.
జూనియర్ న్యాయవాదులతో జస్టిస్ తుహిన్ కుమార్
హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో సన్మానం
అమరావతి, ఆగస్టు5(ఆంధ్రజ్యోతి): కేసుకు సంబంధించి హోమ్ వర్క్, కొంతహార్డ్ వర్క్ చేస్తే విజయం మీ సొంతమవుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తుహిన్ కుమార్ అన్నారు. ‘ఎల్లప్పుడూ ఇది నేను చేయగలను, కేసులో విజయం సాధించగలను’ అనే విశ్వాసం, భావనతో ఉండాలని జూనియర్ న్యాయవాదులకు సూచించారు. నిస్పృహకు గురికావద్దని చెప్పారు. ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ తుహిన్‌కుమార్‌ను ఏపీ హైకోర్టు అడ్వొకేట్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.చిదంబరం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, అడిషనల్ అడ్వొకేట్ జనరల్ సాంబశివ ప్రతాప్, రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, అడ్వొకేట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కేవీ రఘువీర్, ప్రధాన కార్యదర్శి సి.సుబోధ్, కార్యవర్గ సభ్యులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.