Visakhapatnam: ఆటో డ్రైవర్, పోలీసులకు రాఖీ కట్టిన మంత్రి అనిత
ABN , Publish Date - Aug 10 , 2025 | 04:22 AM
రక్షా బంధన్ సందర్భంగా పలువురికి రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత రాఖీ కట్టారు.ఎంవీపీ కాలనీ నుంచి ఉషోదయ కూడలి వరకూ ఆటోలో...
ఎంవీపీ కాలనీ(విశాఖపట్నం),ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): రక్షా బంధన్ సందర్భంగా పలువురికి రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత రాఖీ కట్టారు.ఎంవీపీ కాలనీ నుంచి ఉషోదయ కూడలి వరకూ ఆటోలో ప్రయాణించి, ఆటో డ్రైవర్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.ఆటో డ్రైవర్ గిరీశ్‌కు రాఖీ కట్టారు.అనారోగ్యానికి గురైన ఉషోదయ కూడలి సమీపంలో ఉంటున్న కానిస్టేబుల్ కొర్లయ్యను పరామర్శించారు. అతడికి ధైర్యం చెప్పి రాఖీ కట్టారు.ఎంవీపీ కాలనీ స్టేషన్ సీఐ జె.మురళీ, ట్రాఫిక్ సీఐ ప్రసాద్,విధి నిర్వహణలో ఉన్న కొందరు పోలీసులకు అనిత రాఖీ కట్టారు.