Share News

Guntur Hospital: కందుకూరు హత్య బాధితులకు హోం మంత్రి అనిత పరామర్శ

ABN , Publish Date - Oct 20 , 2025 | 04:39 AM

నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గ పరిధిలోని దారకానిపాడులో జరిగిన దారుణ ఘటనలో తిరుమలశెట్టి లక్ష్మయ్యనాయుడు హత్యకు గురికాగా...

Guntur Hospital: కందుకూరు హత్య బాధితులకు హోం మంత్రి అనిత పరామర్శ

గుంటూరు, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గ పరిధిలోని దారకానిపాడులో జరిగిన దారుణ ఘటనలో తిరుమలశెట్టి లక్ష్మయ్యనాయుడు హత్యకు గురికాగా, ఆయన ఇరువురు సోదరులు తిరుమలశెట్టి పవన్‌, భార్గవ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు గుంటూరులోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రాత్రి హోం మంత్రి అనిత.. ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్‌, కన్నా లక్ష్మీనారాయణలతో కలిసి ఆసుపత్రిలో వారిని పరామర్శించారు. వారి తండ్రి శ్రీనివాసరావును అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్య ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికీ రూ.రెండున్నర లక్షల చొప్పున చెక్కులను అందించారు.

Updated Date - Oct 20 , 2025 | 04:40 AM