Visakhapatnam: అప్పుడు అమ్మకు సీమంతం.. ఇప్పుడు చిన్నారికి ముద్దులు
ABN , Publish Date - Dec 05 , 2025 | 05:46 AM
హోంమంత్రి అనిత ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆందోళన కార్యక్రమానికి బయలుదేరగా, మహిళా కానిస్టేబుల్ రేవతి ఆమెను హౌస్‌అరెస్టు చేశారు.
విశాఖపట్నం, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): హోంమంత్రి అనిత ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆందోళన కార్యక్రమానికి బయలుదేరగా, మహిళా కానిస్టేబుల్ రేవతి ఆమెను హౌస్‌అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమె గర్భవతిగా ఉన్న విషయం తెలుసుకున్న అనిత వారింటికి వెళ్లి సీమంతం చేశారు. గురువారం ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమానికి అనిత హాజరయ్యారు. అక్కడ విధుల్లో ఉన్న రేవతితో మాట్లాడారు. తనకు కుమార్తె పుట్టిందని ఆమె చెప్పగా... ఆ పాపను తీసుకురావాలని కోరారు. రేవతి భర్త పాపను తీసుకురాగా, అనిత ఆ చిన్నారిని ఎత్తుకుని ముద్దాడారు.