Home Minister Anita: రోడ్డు ప్రమాదాలను కట్టడి చేయాలి
ABN , Publish Date - Oct 14 , 2025 | 06:34 AM
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల కట్టడికి పోలీసు శాఖ గట్టి చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు.
అధికారులకు హోంమంత్రి అనిత దిశానిర్దేశం
అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల కట్టడికి పోలీసు శాఖ గట్టి చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులతో సోమవారం ఆమె విజయవాడలో సమీక్షించారు. ‘గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 3.5శాతం రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. ఇందుకు కారణాలను అధ్యయనం చేయాలి. బ్లాక్ స్పాట్స్ వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ఆర్టీజీఎస్ ద్వారా రియల్ టైమ్ ట్రాఫిక్ పరిశీలన, ప్రమాదాలపై నిరంతర మానిటరింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలి. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు చేపట్టిన ‘అస్త్రం’ విధానాన్ని ఇతర పట్టణాల్లోనూ అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఆమె సూచించారు. సమావేశంలో రోడ్ సేఫ్టీ ఏడీజీ కృపానంద త్రిపాఠి, డీఐజీ విజయా రావు, టెక్నికల్ సర్వీసెస్ ఎస్పీ మాలికా గార్గ్ తదితరులు పాల్గొన్నారు.