Home Minister Anita: జగన్‌కు మహిళల ఉసురు
ABN , Publish Date - Sep 02 , 2025 | 05:44 AM
సమావేశాలకు రాకుండా బయట తప్పించుకు తిరుగుతున్న జగన్‌తో కలిపి అసెంబ్లీలో 23 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారని హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు.
స్త్రీలను అవమానాలకు గురి చేసిన ఫలితం
తల్లి, చెల్లి చీరలపైనా తప్పుడు ప్రచారం: అనిత
పిడుగురాళ్లలో స్ర్తీశక్తి విజయోత్సవ సభ
పిడుగురాళ్ల, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): సమావేశాలకు రాకుండా బయట తప్పించుకు తిరుగుతున్న జగన్‌తో కలిపి అసెంబ్లీలో 23 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారని హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. సోమవారం పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు 35 వేల మంది మహిళలతో స్ర్తీశక్తి విజయోత్సవ ర్యాలీ, సభ నిర్వహించారు. ముఖ్యఅతిథి అనిత మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం మహిళలను అనేక రకాలుగా అవమానాలకు గురి చేసిందన్నారు. తల్లి, చెల్లిని మోసం చేసి ఇంటి నుంచి బయటకు గెంటిన జగన్‌కు గత ఎన్నికల్లో మహిళల ఉసురు తగిలిందని చెప్పారు. తల్లి, చెల్లి కట్టుకున్న చీరలపై కూడా తప్పుడు ప్రచారం చేయించారన్నారు. రాష్ట్రంలో మహిళల జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి మాట్లాడుతూ మిగులు విద్యుత్ ఉన్న రాష్ర్టాన్ని జగన్ నాశనం చేశాడన్నారు. త్వరలోనే విద్యుత్ శాఖలో ఏఈ, లైన్‌మెన్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, టీటీడీ బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి, మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.