PPP Policy: కేఏ పాల్ పిల్‌పై విచారణకు హైకోర్టు నిరాకరణ
ABN , Publish Date - Nov 13 , 2025 | 05:03 AM
రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో వైద్య కళాశాలల నిర్మాణాన్ని సవాల్ చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు...
పీపీపీ విధానంలో వైద్య కళాశాలలపై ఇప్పటికే పిల్ దాఖలైందని వెల్లడి
అమరావతి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో వైద్య కళాశాలల నిర్మాణాన్ని సవాల్ చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిల్‌పై విచారణ జరిపేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇదే వ్యవహారంపై ఇప్పటికే ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైనందున ఆయన పిటిషన్‌ను విచారించలేమని తెలిపింది. అయితే ఆ పిల్‌లో ఇంప్లీడై వాదనలు వినిపించేందుకు ఆయనకు వెసులుబాటు ఇచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.