High Court Questions Policy on Setting Up Lokayukta: కర్నూలులో లోకాయుక్త... విధాన నిర్ణయం
ABN , Publish Date - Dec 18 , 2025 | 04:01 AM
ఏపీఎ్‌సహెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త కార్యాలయాలను కర్నూలులోనే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది...
అందులో మేము ఎలా జోక్యం చేసుకోగలం?
మాకూ కొన్ని పరిధులు ఉంటాయి: హైకోర్టు
కౌంటర్‌ను పరిశీలించి రావాలని పిటిషనర్‌కు సూచన
అమరావతి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): ఏపీఎ్‌సహెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త కార్యాలయాలను కర్నూలులోనే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) ఎస్.ప్రణతి బుధవారం హైకోర్టుకు నివేదించారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న ఽహైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం 2021లో ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ రికార్డుల్లో లేకపోవడంతో విచారణను వాయిదా వేసింది. విచారణ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ... కర్నూలులో హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త ఏర్పాటు విధానపరమైన నిర్ణయమని, పాలసీ నిర్ణయాల్లో తాము ఎలా జోక్యం చేసుకోగలమని పిటిషనర్‌ను ప్రశ్నించింది. తమకూ కొన్ని పరిధులు ఉంటాయని వ్యాఖ్యానించింది. ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ఏపీ లోకాయుక్త, రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ప్రధాన కార్యాలయాలను కర్నూలులో ఏర్పాటు చేయడాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరుతూ డాక్టర్ మద్దిపాటి శైలజ 2021లో హైకోర్టులో పిల్ వేశారు. మానవహక్కుల కమిషన్‌లో సిబ్బంది నియామకంతో పాటు ఫిర్యాదులు స్వీకరణకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఏపీ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ మరో పిల్ వేసింది. బుధవారం ఈ వ్యాజ్యాల విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది డీఎ్‌సఎన్‌వీ ప్రసాద్‌బాబు వాదనలు వినిపించారు.