Ketireddy Peddareddy: కేతిరెడ్డి పెద్దారెడ్డికి భద్రత కల్పించండిC
ABN , Publish Date - Aug 15 , 2025 | 05:44 AM
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈనెల 18న తాడిపత్రిలోని ఆయన ఇంటికి వెళ్లడానికి, అక్కడ నివసించడానికి..
అమరావతి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈనెల 18న తాడిపత్రిలోని ఆయన ఇంటికి వెళ్లడానికి, అక్కడ నివసించడానికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డికి అనుమతి ఇచ్చింది. కాన్వాయ్‌లో 5 వాహనాలకు మించి ఉండకూడదని తేల్చిచెప్పింది. అనుచరులను రెచ్చగొట్టకూడదని, ఇంటివద్ద ఏ సమయంలో కూడా 50-60 మందికి మించి జనం ఉండటానికి వీల్లేదని స్పష్టం చేసింది. విచారణను సెప్టెంబరు 19కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్ ఉత్తర్వులు ఇచ్చారు.