Share News

AP High Court:నల్లపురెడ్డిపై కేసు పూర్తి వివరాలు ఇవ్వండి

ABN , Publish Date - Jul 12 , 2025 | 05:01 AM

టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డిపై నమోదైన కేసు పూర్తి వివరాలు తమ ముందు...

AP High Court:నల్లపురెడ్డిపై కేసు పూర్తి వివరాలు ఇవ్వండి

  • పోలీసులకు హైకోర్టు ఆదేశం

అమరావతి, జూలై 11(ఆంధ్రజ్యోతి): టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డిపై నమోదైన కేసు పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ప్రసన్నకుమార్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. అంతకుముందు పిటిషనర్‌ తరఫున న్యాయవాది సి.సుబోద్‌ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌పై నమోదైన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు శిక్షకు వీలున్నవేనన్నారు. పిటిషన్‌పై అత్యవసరం విచారణ జరపాలని కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ... ఏడేళ్లలోపు శిక్షకు వీలున్న కేసులలో ఆందోళన ఎందుకని ప్రశ్నించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. కేసు మొదటిసారి విచారణకు వచ్చిందని, వివరాలు తెప్పించుకొని కోర్టు ముందు ఉంచేందుకు సమయం ఇవ్వాలని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను వాయిదా వేశారు. ప్రసన్నకుమార్‌రెడ్డి తనను అసభ్య పదజాలంతో దూషించారని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Updated Date - Jul 12 , 2025 | 11:59 AM