High Court Judge Satti Subbareddy: న్యాయ సాధనలో న్యాయవాదుల పాత్ర కీలకం
ABN , Publish Date - Oct 26 , 2025 | 05:29 AM
కక్షిదారులకు న్యాయాన్ని అందించడంలో న్యాయవాదుల పాత్ర కీలకమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి అన్నారు..
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి
శ్రీకాకుళం లీగల్, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): కక్షిదారులకు న్యాయాన్ని అందించడంలో న్యాయవాదుల పాత్ర కీలకమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి అన్నారు. శనివారం శ్రీకాకుళంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో హైకోర్టు మరో న్యాయమూర్తి జస్టిస్ తుహిన్ కుమార్‌తో కలిసి జిల్లా 7వ అదనపు న్యాయస్థానాన్ని ఆయన ప్రారంభించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాజీ నక్సలైట్ దున్న కేశవరావు అలియాస్ ఆజాద్‌పై ఉన్న కేసులు త్వరితగతిన విచారణ నిమిత్తం ఈ కోర్టును ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని జస్టిస్ సుబ్బారెడ్డి తెలిపారు. జస్టిస్ తుహిన్ కుమార్ మాట్లాడుతూ.. ‘జూనియర్ న్యాయవాదులు సీనియర్ల నుంచి ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవాలి. వృత్తిలో నైపుణ్యం సాధించాలి. ఏ కేసుకైనా కింద కోర్టు విచారణే ముఖ్యం’ అని తెలిపారు.