మహానందిలో హైకోర్టు న్యాయమూర్తి పూజలు
ABN , Publish Date - Sep 28 , 2025 | 11:42 PM
మహానంది క్షేత్రంలో ఆదివారం రాత్రి ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ భానుమతి ప్రత్యేక పూజలు చేశారు.
మహానంది, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలో ఆదివారం రాత్రి ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ భానుమతి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం ముఖద్వారం వద్ద అర్చకులు వీరికి స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయా ల్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అభిషేకాలు, కుంకు మార్చన పూజలను చేశారు. న్యాయమూర్తిని వేదపండితులు సన్మానించి ఆశీర్వదించారు. స్వామి వారి జ్ఞాపికను అందజేశారు.