High Court: మద్యం కేసులో నిందితుడు పైలా దిలీప్‌కు హైకోర్టు నోటీసులు
ABN , Publish Date - Sep 11 , 2025 | 05:28 AM
ద్యం కుంభకోణం కేసులో నిందితుడు, రాజ్ కసిరెడ్డి అనుచరుడు పైలా దిలీప్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దిలీప్‌కు బెయిల్ మంజూరు చేస్తూ గత నెల 28న ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను....
సీఐడీ పిటిషన్‌పై విచారణ 15కి వాయిదా
అమరావతి, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో నిందితుడు, రాజ్ కసిరెడ్డి అనుచరుడు పైలా దిలీప్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దిలీప్‌కు బెయిల్ మంజూరు చేస్తూ గత నెల 28న ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ బుధవారం విచారణకు రాగా... కేసు మొదటిసారి విచారణకు వచ్చిందని న్యాయస్థానం గుర్తు చేసింది. దిలీప్‌కు నోటీసులు జారీ చేసి అతని వాదనలు కూడా వినాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. తదుపరి విచారణను సెప్టెంబరు 15కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు హాజరయ్యారు.