High Court Hosts Grand Semi Christmas: హైకోర్టులో ఘనంగా సెమీ క్రిస్మస్
ABN , Publish Date - Dec 24 , 2025 | 05:14 AM
హైకోర్టులో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం హైకోర్టు అడ్వొకేట్ అసోసియేషన్ హాలులో నిర్వహించిన..
అమరావతి, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): హైకోర్టులో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం హైకోర్టు అడ్వొకేట్ అసోసియేషన్ హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు. సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. హైకోర్టు అడ్వొకేట్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.చిదంబరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రఘువీర్, ప్రధాన కార్యదర్శి సుబోధ్, కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.