AP High Court: స్లీపర్ సెల్స్‌పై విచారణ జరపండి
ABN , Publish Date - May 22 , 2025 | 05:59 AM
రాష్ట్రంలో ఉగ్రవాద స్లీపర్ సెల్స్ గుర్తించేందుకు పోలీసులను చర్యలు తీసుకునేలా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థకు (ఎన్‌ఐఏ) నోటీసులు జారీ చేసి, విచారణను గురువారం వరకు వాయిదా వేసింది.
డీజీపీకి హైకోర్టు ఆదేశం.. ఎన్‌ఐఏకు నోటీసులు..విచారణ నేటికి వాయిదా
అమరావతి, మే 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉగ్రవాద స్లీపర్ సెల్స్‌ను గుర్తించేందుకు చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. పిటిషనర్లు ఇచ్చిన వివరాల ఆధారంగా రాష్ట్రంలో ఉన్న స్లీపర్ సెల్స్‌పై విచారణ జరిపి నివేదికను కోర్టు ముందు ఉంచాలని డీజీపీని ఆదేశించింది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు నోటీసులు జారీ చేసింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు.