Share News

Lawyer Association: హైకోర్టు న్యాయవాదుల సంఘం

ABN , Publish Date - Dec 06 , 2025 | 05:42 AM

హైకోర్టు న్యాయవాదుల సంఘం ఎన్నికల్లో మహిళలకు 1/3 వంతు రిజర్వేషన్లు కల్పించేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది.

Lawyer Association: హైకోర్టు న్యాయవాదుల సంఘం

  • ఎన్నికల్లో మహిళలకు 1/3 రిజర్వేషన్‌!

  • హైకోర్టు ఆదేశం.. వ్యాజ్యంపై విచారణ వాయిదా

అమరావతి, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): హైకోర్టు న్యాయవాదుల సంఘం ఎన్నికల్లో మహిళలకు 1/3 వంతు రిజర్వేషన్లు కల్పించేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. రిజర్వేషన్‌ కల్పనకు సంబంధించి ఓ విధానంతో తమ ముందుకు రావాలని అసోసియేషన్‌ అధ్యక్షుడు, కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఎన్నికలలో మహిళా న్యాయవాదులకు మూడింట ఒక వంతు (1/3) రిజర్వేషన్‌ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పార్టీ ఇన్‌పర్సన్‌గా న్యాయవాది తోట సునీత పిటిషన్‌ దాఖలు చేశారు. శుక్రవారం జరిగిన విచారణలో అడ్వొకేట్‌ అసోసియేషన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది చిదంబరం వాదనలు వినిపించారు.

Updated Date - Dec 06 , 2025 | 05:42 AM