High Court: విచారణార్హతపై వాదనలు వినిపించండి
ABN , Publish Date - Nov 07 , 2025 | 06:06 AM
మద్యం కుంభకోణంకేసు దర్యాప్తులో భాగంగా సీఆర్పీసీ సెక్షన్ 161 కింద నమోదుచేసిన తమ వాంగ్మూలాలను దర్యాప్తు రికార్డుల నుంచి తొలగించాలని కోరుతూ పెనక రోహిత్‌రెడ్డి, పెనక...
రోహిత్‌రెడ్డి, శరత్‌చంద్రారెడ్డిలకు హైకోర్టు ఆదేశం
మద్యం కుంభకోణంకేసు దర్యాప్తులో భాగంగా సీఆర్పీసీ సెక్షన్ 161 కింద నమోదుచేసిన తమ వాంగ్మూలాలను దర్యాప్తు రికార్డుల నుంచి తొలగించాలని కోరుతూ పెనక రోహిత్‌రెడ్డి, పెనక శరత్‌చంద్రారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లకు విచారణార్హత లేదని సిట్ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు హైకోర్టుకు నివేదించారు. ముందుగా విచారణార్హతపై వాదనలు వినాలని అభ్యర్థించారు. వ్యాజ్యాల విచారణార్హతపై ప్రాసిక్యూషన్ అభ్యంతరం లేవనెత్తుతున్న నేపథ్యంలో ముందుగా ఈ వ్యవహారంపై తదుపరి విచారణలో వాదనలు వినిపించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది మయాంక్‌జైన్‌కు జస్టిస్ వెంకట జ్యోతిర్మయి సూచించారు.