High Court: బీసీ జనగణన తర్వాతే స్థానిక ఎన్నికలు జరపాలి
ABN , Publish Date - Nov 13 , 2025 | 04:47 AM
బీసీ జనగణన జరిపిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం...
ఏపీ బీసీ సంక్షేమ సంఘం పిల్
పూర్తి వివరాలతో కౌంటర్‌కు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
అమరావతి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): బీసీ జనగణన జరిపిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక, పంచాయతీరాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు ఈ పిల్ దాఖలు చేశారు. మరోవైపు.. రాష్ట్రంలో కుల గణనతోపాటు, జనాభా దామాషా మేరకు బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధంగా వర్గీకరించాలని శంకరరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు వినతిపత్రం అందజేశారు. బీసీ రిజర్వేషన్లను చట్టబద్ధంగా వర్గీకరించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎ్‌సను కోరినట్టు బుధవారం ఓ ప్రకటనలో ఆయన తెలిపారు.