Share News

ఏ, బీ, సీ క్యాంపుల్లో హైకోర్టు బెంచ

ABN , Publish Date - Oct 29 , 2025 | 11:30 PM

నగరంలోని ఏ, బీ, సీ క్యాంపుల్లో హైకోర్టు బెంచ ఏర్పాటుపై సీఎం చంద్రబాబుతో చర్చించానని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.

       ఏ, బీ, సీ క్యాంపుల్లో హైకోర్టు బెంచ
సమీక్ష లో అధికారరులతో మాట్లాడుతున్న మంత్రి టీజీ భరత

స్మార్ట్‌ సిటీ పనులు వేగవంతం

మెడికల్‌ కాలేజీ రోడ్డులోని షాపులపై కోర్టు తీర్పు అమలు

నగర పాలక సంస్థ అధికారులతో మంత్రి భరత

కర్నూలు అర్బన, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): నగరంలోని ఏ, బీ, సీ క్యాంపుల్లో హైకోర్టు బెంచ ఏర్పాటుపై సీఎం చంద్రబాబుతో చర్చించానని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. బుధవారం ఎస్‌బీఐ కాలనీలోని నగర పాలక సంస్థ కార్యాలయంలో అధికారుల సమీక్ష అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం కర్నూలుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, ప్రగతిలో ముఖ్యస్థానాన్ని ఇవ్వాలనే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. కర్నూల్లో హైకోర్టు బెంచ ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని, ఈ భవనాలను నగర శివార్లలో కాకుండా ఏ, బీ, సీ క్యాంపుల్లో ఏర్పాటు చేసే అంశంపై ఇటీవల విదేశీ పర్యటనలో సీఎం చంద్రబాబుతో చర్చించానని వెల్లడించారు. సీఎం చంద్రబాబు దీనికి సానుకూలంగా స్పందించారని తెలిపారు. వాటిలోనే స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు పనుల కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరంలోని బుధవారపేట మెడికల్‌ కాలేజీ మలుపు వద్ద ఉన్న షాపుల తొలగింపుపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. తరువాత రహదారులు విస్తరణ, పారిశుధ్యం, టిడ్కో గృహాలు, గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలు పురోగతి తదితర అంశాలపై నగర పాలక సంస్థ అఽధికారులతో సమీక్షించారు. నగరంలో రూ. 12.62 కోట్లతో జరుగుతున్న 62 అభివృద్ధి పనులపై కాంట్రాక్టర్ల వారిగా సమీక్ష నిర్వహించారు. జాప్యం జరుగుతున్న పనులపై ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలస్యం చేసే కాంట్రాక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షలో కమిషనర్‌ ిపి. విశ్వనాథ్‌, అదనపు కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణ, డిప్యూటీ కమిషనర్‌ సతీష్‌కుమార్‌, మేనేజర్‌ చిన్న రాముడు, ఇనచార్జీ ఎస్‌ఈ శేషసాయి, జునైదు, స్వర్ణలత, నాగరాజు, మనోహర్‌రెడ్డి, అంజాద్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 29 , 2025 | 11:30 PM