Share News

పండ్ల తోటల సాగుకు చేయూత :పీడీ

ABN , Publish Date - Jun 18 , 2025 | 12:13 AM

పండ్లు, పూల తో టల సాగుకు ఉ పాధి హామీ పథ కం ద్వారా రైతుల కు చేయూ త అం దిస్తున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్‌ డైరె క్టర్‌ సూర్య నారా యణ తెలిపారు.

 పండ్ల తోటల సాగుకు చేయూత :పీడీ
సాగు చేసిన తోటను పరిశీలిస్తున్న పీడీ సూర్య నారా యణ

శిరివెళ్ల, జూన 17(ఆంధ్రజ్యోతి) : పండ్లు, పూల తో టల సాగుకు ఉ పాధి హామీ పథ కం ద్వారా రైతుల కు చేయూ త అం దిస్తున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్‌ డైరె క్టర్‌ సూర్య నారా యణ తెలిపారు. మండలంలోని యర్రగుంట్ల, శిరివెళ్ల గ్రామాల్లో ఉపాధిహామీ పథకం ద్వారా రైతులు సాగు చేసిన మునగ, మామిడి, మల్లె తోటలను ఆయన మంగళవారం పరిశీలించారు. జిల్లాలో నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేస్తున్నా మన్నారు. అనంతరం వీరారెడ్డిపల్లె గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను ఆయన తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఏపీడీ సాంబ శివరావు, ప్లాంటేషన సూపర్‌వైజర్‌ వెంకట సుబ్బయ్య, ఎంపీడీవో శివమల్లేశ్వరప్ప, ఏపీవో రామసుబ్బయ్య, టెక్నికల్‌ అసిస్టెంట్లు బాలకృష్ణ, ఉమాశంకర్‌, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 12:13 AM