హెచ కైరవాడి రెవెన్యూ సహాయకుడు మృతి
ABN , Publish Date - Mar 17 , 2025 | 12:03 AM
గోనెగండ్ల మండలం హెచ కైరవాడి గ్రామ రెవెన్యూ సహాయకుడు చిన్నరాముడు (58) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందాడు.
గోనెగండ్ల, మార్చి 16(ఆంధ్రజ్యోతి): గోనెగండ్ల మండలం హెచ కైరవాడి గ్రామ రెవెన్యూ సహాయకుడు చిన్నరాముడు (58) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది రామకృష్ణ, సర్వేయర్ వెంకటేష్ లు బాధిత కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపి దహన సం స్కారాలకు ప్రభుత్వం తరుపున రూ. 25వేలు అందజేశారు. అలాగే రెవె న్యూ సహాయకుల మండల నాయకులు రూ. 5వేలు అందజేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రంగన్న, రామాంజినేయులు, నబిసాబ్, దస్తగిరి, తిరుమలేష్, ఐరనబండ బడేసాబ్, చిన్ననేలటూరు దాసన్న పాల్గొన్నారు.