Heavy Rainfall: మూడు రోజులు భారీ వర్షాలు!
ABN , Publish Date - Sep 10 , 2025 | 05:58 AM
దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో మంగళవారం కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి...
దక్షిణ కోస్తాలో కొనసాగనున్న ఎండ తీవ్రత
కావలిలో 39.2, నెల్లూరులో 39.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు
అమరావతి/విశాఖపట్నం, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో మంగళవారం కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఒకటి, రెండుచోట్ల భారీవర్షాలు పడ్డాయి. గుంటూరు జిల్లా నల్లపాడులో 7.1, కాకుమానులో 5.2 సెంటీమీటర్ల వాన పడింది. దక్షిణ కోస్తాలో ఎండ తీవ్రంగా ఉంది. కావలిలో 39.2, నెల్లూరులో 39.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం నుంచి రెండు, మూడు రోజులపాటు కోస్తాలో ఎక్కువచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 3 రోజులు అక్కడక్కడా పిడుగులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.