Share News

Weather Department: సీమ, దక్షిణ కోస్తాకు వర్షసూచన

ABN , Publish Date - Oct 18 , 2025 | 06:25 AM

ఈశాన్య రుతుపవనాల ప్రవేశంతో బంగాళాఖాతం నుంచి భూ ఉపరితలంపైకి తూర్పు గాలులు వీస్తున్నాయి. దీంతో శుక్రవారం రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి.

Weather Department: సీమ, దక్షిణ కోస్తాకు వర్షసూచన

విశాఖపట్నం, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): ఈశాన్య రుతుపవనాల ప్రవేశంతో బంగాళాఖాతం నుంచి భూ ఉపరితలంపైకి తూర్పు గాలులు వీస్తున్నాయి. దీంతో శుక్రవారం రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో అక్కడక్కడా భారీవర్షాలు, ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కేరళ, కర్ణాటకను ఆనుకుని శనివారం అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. రెండు రోజుల్లో ఇది వాయుగుండంగా బలపడనుంది. దీని ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తేమగాలులు భూ ఉపరితలం మీదుగా అరేబియా సముద్రంలోని అల్పపీడనం దిశగా వీయనున్నాయి. దీంతో ఈనెల 19 నుంచి రాయలసీమ, దక్షిణ కోస్తా, 20 నుంచి ఉత్తరకోస్తాలో వర్షాలు పెరగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - Oct 18 , 2025 | 06:26 AM