Share News

జూపాడుబంగ్లాలో భారీ వర్షం

ABN , Publish Date - Oct 06 , 2025 | 11:21 PM

మండలంలోని వివిధ గ్రామాల్లో సోమవారం తెల్లవారుజామున భారీవర్షం కురిసింది.

జూపాడుబంగ్లాలో భారీ వర్షం
80బన్నూరు వద్ద వర్షపు నీటిలో మునిగిన వరిపైరు

ఉప్పొంగిన వాగులు, వంకలు

జూపాడుబంగ్లా, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వివిధ గ్రామాల్లో సోమవారం తెల్లవారుజామున భారీవర్షం కురిసింది. దీంతో పారుమంచాల కాకిలేరు, ఇసుకవాగులు ఉప్పొంగి ప్రవహించాయి. ఈ వర్షంతో మొక్కజొన్నరైతులు, పత్తిరైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. 80బన్నూరు వద్ద వాగు ఉదృతికి వరిపైరు నీట మునిగింది. పారుమంచాల ఇసుకవాగు ఉప్పొంగి ప్రవహించడంతో ప్రధానరహదారిపై ఆర్టీసీ బస్సు , వాహనాలు దాటడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వంతెన ఎప్పుడో పూర్తి చేస్తారో సమస్య తీరుతుందోనని గ్రామస్థులు అధికారులు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూపాడుబంగ్లాలోని ఉద్యానవనపార్కు, తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణంతా వర్షపునీటితో నిలిచిపోయింది. మొత్తం 43.2 మీ.మీ., వర్షపాతం నమోదు అయినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.

Updated Date - Oct 06 , 2025 | 11:21 PM