ఆత్మకూరులో భారీ వర్షం
ABN , Publish Date - Apr 20 , 2025 | 11:31 PM
పట్టణంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.
ఆత్మకూరు, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): పట్టణంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మఽధ్యాహ్నం వరకు విపరీతంగా ఎండ ఉన్నప్పటికీ ఆతర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో పాటు ఉరుములు, మెరుపులు, పెనుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సాయంత్రం గంటల నుంచి సుమారు 45నిమిషాల పాటు ఏకధాటిగా వర్షం కురియడంతో పట్టణంలోని పలు కాలనీల్లో వర్షపునీరు నిలిచింది. అదేవిధంగా పట్టణంలోని పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి.