Heavy Rain: తిరుమలలో భారీ వర్షం
ABN , Publish Date - Oct 05 , 2025 | 04:04 AM
తిరుమలలో శనివారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వేకువజాము ఐదు నుంచి ఉదయం 8 గంటల వరకు వర్షం పడటంతో శ్రీవారి దర్శనానికి..
తిరుమల, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): తిరుమలలో శనివారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వేకువజాము ఐదు నుంచి ఉదయం 8 గంటల వరకు వర్షం పడటంతో శ్రీవారి దర్శనానికి వెళ్లే వారితో పాటు దర్శనం చేసుకుని వెలుపలకు వచ్చిన వారు తడుస్తూ వెళ్లాల్సి వచ్చింది. మరోవైపు తిరుమలలో చలి పెరిగింది. పెరటాశి మాసం మూడో శనివారం కావడంతో తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. కాగా.. తిరుపతిలో వేకువజాము నుంచి ఉదయం 9 గంటల వరకూ మోస్తరు వాన కురిసింది. ఈస్ట్ పోలీస్ స్టేషన్ పక్కనున్న రైల్వే అండర్ పాస్, అలాగే వెస్ట్ చర్చి సమీపంలోని రైల్వే అండర్ పాస్‌లు నీట మునిగి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. లక్ష్మీపురం కూడలి నుంచి ఎయిర్ బైపాస్ రోడ్డు వరకూ రోడ్డు జలమయమైంది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా శనివారం మోస్తరు వర్షాలు కురిశాయి.